మీ ఆధార్ కార్డు కి Mobile number ని ఇప్పుడు ఇంటి వద్ద నుంచే link చేసుకోవచ్చు : మీరు మీ ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేయాలి అనుకుంటున్నారా, అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ మొత్తం చదివినట్లయితే మీరు ఇంట్లోనే కూర్చొని మీ యొక్క ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు అలాగే అప్డేట్ కూడా చేసుకోవచ్చు అవునండి, ఇక నుంచి మీ ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మీరు ఆధార్ సెంటర్ కు వెళ్ళవలసిన పని లేకుండా ఇంటి వద్ద నుంచి చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐ పి పి బి) వాళ్ళు కల్పిస్తున్నారు.

Update Your Mobile Number on Aadhaar Card at Your Doorstep

 

Update Your Mobile Number on Aadhaar Card at Your Doorstep



మన ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేయడానికి మనకి Doorstep అవకాశం కల్పించడం కోసం 650 పోస్ట్ IPPB బ్రాంచ్ నుంచి 1.46 వేల మంది పోస్ట్ మెన్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ Doorstep అవకాశం కల్పించేందుకు పోస్ట్ మెన్ అందరికీ కూడా స్మార్ట్ఫోన్లు అలాగే బయోమెట్రిక్ డివైస్ ల తో సిద్ధం చేయడం జరిగింది.

మన ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి ఈ Doorstep అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కోసం ippb వాళ్లు మనకి కస్టమర్ కేర్ నంబర్లను అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క మొబైల్ నంబర్లకు మనం కాల్ చేసి రిక్వెస్ట్ రైస్ చేసుకుంటే పోస్ట్ మాన్ మన ఇంటికి వచ్చి మన యొక్క ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం జరుగుతుంది మనం ఎలాంటి ఆధార్ సెంటర్ కి వెళ్ళ వలసిన అవసరం ఉండదు.

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఈ అవకాశాన్ని మనకు 20 జూలై 2021లో లాంచ్ చేశారు. మీరు మీ ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి అనుకుంటే ఈ కింద కనిపిస్తున్న కస్టమర్ కేర్ నెంబర్ కి (155299/1800-180-7980) కాల్ చేసి రిక్వెస్ట్ రైస్ చేసుకోండి.



Update Your Mobile Number on Aadhaar Card at Your Doorstep