New Ration Card List Check Online in Telangana State 2024: Hello viewers, మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నట్లయితే,అర్హత గల రేషన్ కార్డుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఈ ఆర్టికల్ పూర్తిగా చదివినట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అవునండి,కొత్తగా అప్రూవ్  చేసిన 3,09,083 రేషన్ కార్డుల జాబితా మనకి రిలీజ్ అయిపోయింది. ఈ రేషన్ కార్డుల జాబితా లో మీ పేరు ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం.

 

Steps to Check New Ration List online in Telangana


Step 1:రేషన్ కార్డుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడానికి ముందుగా క్రింద చూపించిన లింకు పైన క్లిక్ చేయండి. https://epds.telangana.gov.in/FoodSecurityAct/reports/ ఆహారభద్రత కార్డు తెలంగాణ ప్రభుత్వం web-portal అనేది మనకి ఓపెన్ అయిపోతుంది.

New Ration Card List Telangana



Step 2: ఇక్కడ మీ యొక్క డిస్టిక్ నేమ్ పైన క్లిక్ చేయండి.

Step 3: ఆ తరువాత మీయొక్క ఆఫీస్ నేమ్ పైన క్లిక్ చేయండి.

Step 4: మనకి షాప్ నెంబర్ తో కలిగిన జాబితా ఓపెన్ అయిపోతుంది. ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ముందుగా మీ ఇంటికి చుట్టుపక్కల ఉన్న రేషన్ షాప్ నెంబర్ తెలుసుకోవాలి.

Step 5: మీ చుట్టుపక్కల ఉన్న రేషన్ షాప్ నెంబర్ తెలిసినట్లయితే ఆ యొక్క షాప్ నెంబర్ చూసుకొని దాని పైన క్లిక్ చేయాలి.

Step 6: అప్పుడు మనకి ఆ షాప్ నెంబర్ కి సంబంధించిన రేషన్ కార్డుల జాబితా మొత్తం వివరంగా ఓపెన్ అవుతుంది. ఆ జాబితాలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అలాగే అడ్రస్ చెక్ చేసుకొని మన పేరు ఆ జాబితాలో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి.ఆ జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీకు రేషన్ కార్డ్ ఏ తేదీన అప్రూవల్ అయింది అనేది కూడా మనకి తెలుస్తుంది.

ఉదాహరణకు కింద కనిపిస్తున్న వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు.


 
Watch on Youtube
New Ration List Check online in Telangana https://youtu.be/Rqo1vjomdpw



New Ration Card List Check Online in Telangana